Home > తెలంగాణ > మైనారిటీ స్కాలర్ షిప్ లు రిలీజ్ చేయండి: అక్బరుద్దీన్ ఒవైసీ

మైనారిటీ స్కాలర్ షిప్ లు రిలీజ్ చేయండి: అక్బరుద్దీన్ ఒవైసీ

మైనారిటీ స్కాలర్ షిప్ లు రిలీజ్ చేయండి: అక్బరుద్దీన్ ఒవైసీ
X

మైనారిటీ విద్యార్థుల స్కాలర్ షిప్ లను వెంటనే రిలీజ్ చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాట్లాడిన అక్బరుద్దీన్.. మైనారిటీ విద్యార్థుల స్కాలర్ షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలన్నారు. అదేవిధంగా షాదీ ముబారక్ పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరిచాలని కోరారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికి తాము సహకరిస్తామని, కానీ మైనారిటీల అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని అన్నారు. ఓల్డ్ సిటీలో రోడ్లు వెడల్పు పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్న ఆయన.. వాటిని తక్షణమే పరిష్కరించాలన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ హయాంలో మైనారిటీలకు మేలు జరిగిందని అన్నారు.

కేసీఆర్ ఉర్దూను రాష్ట్రంలో రెండో భాషగా చేశారని, అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు. డీఎస్సీలో ఉర్దూ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ ను ఎన్నుకున్నారని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోవాలని హితవు పలికారు. తాము అధికారంలోకి వస్తే మైనారిటీ సబ్ ప్లాన్ తెస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారని.. ఆ హామీని నెరవేర్చాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారెంటీలతో పాటు మిగిలిన అన్ని హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మైనారిటీ సబ్ ప్లాన్, బీసీ సబ్ ప్లాన్ ల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సభలో సమాధానం ఇవ్వాలని అక్బరుద్దీన్ కోరారు.

Updated : 16 Dec 2023 9:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top