Home > తెలంగాణ > బొత్స వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్‌ కౌంటర్

బొత్స వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్‌ కౌంటర్

బొత్స వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్‌ కౌంటర్
X

తెలంగాణ విద్యావ్యస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ మంత్రులు బొత్స వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా బొత్స సత్యనారాయణపై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన గంగుల..బొత్స చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైసీపీలో ఉన్న బొత్స గతంలో కాంగ్రెస్ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. తెలంగాణ వచ్చాక కూడా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో టీచర్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంటే..ఏపీలో టీచర్ల బదిలీలకు ఇప్పటికీ రూ.లక్షకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రాలో ఎమ్మెల్యేలు, ఏపీపీఎస్సీ సభ్యులే వసూళ్లు చేసి ఉద్యోగాలు ఇస్తున్నారని గంగుల అన్నారు. బొత్స వ్యాఖ్యలపై వెనక జగన్ ప్రభుత్వం లేకపోతే చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. సాయంత్రంలోపు దీనిపై బొత్స స్పందించిన తర్వాత ఆయన హైదరాబాద్‌లో అడుగు పెట్టాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత విద్యా వ్య‌వ‌స్థ మెరుగుప‌డింద‌ని క‌మ‌లాక‌ర్ స్ప‌ష్టం చేశారు. ఉమ్మ‌డి ఏపీలో తెలంగాణ‌లో కేవ‌లంలో 297 గురుకులాలు మాత్ర‌మే ఉండేవి. కానీ ఇప్పుడు గురుకులాల సంఖ్య 1009కి చేరింద‌న్నారు ఏపీలో ఇప్ప‌టికీ గురుకులాల సంఖ్య పెర‌గ‌లేద‌ని క‌మ‌లాక‌ర్ తెలిపారు. ఏపీలోని గురుకులాల‌ను ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు ప‌రిమితం చేశార‌ని చెప్పారు.

Updated : 13 July 2023 10:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top