ఎస్సీ వర్గీకరణపై మోడీ స్పష్టమైన హామీ ఇవ్వాలి - హరీశ్ రావు
X
ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్రమోడీ స్పష్టమైన హామీ ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. త్వరలో తెలంగాణకు రానున్న ప్రధాని దీనిపై ప్రకటన చేయాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో బిల్లు పాస్ చేయాలని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఎమ్మార్పీఎస్ సభలో పాల్గొన్న హరీశ్‌రావు... వర్గీకరణపై అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసినా.. 9ఏండ్లుగా కేంద్రం తాత్సారం చేస్తోందని ఆరోపించారు.
ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రానికిలేని ఇబ్బంది కేంద్రానికి ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ పోరాటానికి ఉద్యమ సమయంలోనే కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. భూమి కొరత వల్ల ఎస్సీలకు మూడు ఎకరాలు ఇవ్వలేకపోయామని హరీశ్ రావు స్పష్టం చేశారు. అందుకే దేశంలో ఎక్కడాలేనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. రాష్ట్రంలో 33 ఎస్సీ స్టడీ సర్కిళ్లు, గురుకులాలు ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.