Home > తెలంగాణ > రాహుల్ గాంధీ ఓ అజ్ఞాని.. వచ్చి చూస్తే తెలుస్తది : హరీష్ రావు

రాహుల్ గాంధీ ఓ అజ్ఞాని.. వచ్చి చూస్తే తెలుస్తది : హరీష్ రావు

రాహుల్ గాంధీ ఓ అజ్ఞాని.. వచ్చి చూస్తే తెలుస్తది : హరీష్ రావు
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు పెట్టింది 80వేల కోట్లు మాత్రమే అని.. కానీ లక్ష కోట్లు ఖర్చు చేశారని రాహుల్ అనడం విడ్డూరమన్నారు. రాహుల్ గాంధీ ఓ అజ్ఞాని అని.. దానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రిగిందంటూ రాహుల్ గాంధీ అన‌డం స‌రికాద‌ని.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు అయిందా.. లేదా అన్న విష‌యం వ‌చ్చి చూస్తే తెలుస్తుందని మండిపడ్డారు.

కాళేశ్వ‌రం పూర్త‌యితేనే కదా యాసంగిలో అంత పంట పండింది అని హ‌రీష్ రావు గుర్తు చేశారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన తుంపర సేద్య పరికరాల పంపిణీ, ఆయిల్ పామ్ సాగు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. వ‌ర్షాభావ ప‌రిస్థితులు తలెత్తితే కాలేశ్వరం ద్వారా రైతులకు నీళ్లివ్వాలని సీఎం కేసీఆర్ సూచించార‌ని ఆయన తెలిపారు.

రైతులు ఇబ్బంది పడొద్దనేదే సీఎం ఉద్ధేశ్యమని.. అందుకు తగ్గట్లే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు. వ్య‌వ‌సాయ బావుల వ‌ద్ద ఒక్క మీట‌ర్ మీద 25వేల క‌రెంట్ బిల్లును ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌న్నారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్న తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు రాహుల్ గాంధీకి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ లాంటి పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.

Updated : 5 July 2023 5:08 PM IST
Tags:    
Next Story
Share it
Top