Home > తెలంగాణ > రైతు రుణమాఫీపై హరీష్ రావు కీలక ప్రకటన

రైతు రుణమాఫీపై హరీష్ రావు కీలక ప్రకటన

రైతు రుణమాఫీపై హరీష్ రావు కీలక ప్రకటన
X

రైతుల రుణమాఫీపై మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తున్నామన్న ఆయన.. లక్షపై ఉన్న రుణాల మాఫీ కూడా త్వరలోనే చేపడతామన్నారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ రైతుల అకౌంట్ పనిచేయకున్నా.. యాక్టివేట్ చేసి మాఫీ జరిగేలా చూస్తామని చెప్పారు. రైతుల సంక్షేమానికి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని.. ఆ పథకాలే మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేరు.. బీజేపీకి క్యాడర్ లేదు.. బీఆర్ఎస్ కు తిరుగులేదని హరీష్ రావు అన్నారు. టికెట్లు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ లో ఉందని.. లీడర్లు లేకనే దరఖాస్తులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 35 నుంచి 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి నాయకులే లేరన్నారు. దరఖాస్తుల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారని.. అభ్యర్థుల దరఖాస్తులు అమ్ముకున్న పార్టీ రేపు రాష్ట్రాన్ని కూడా అమ్ముతుందని ఆరోపించారు.





ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థి.. ఇదే బీఆర్ఎస్ నినాదమని హరీష్ చెప్పారు. రాష్ట్రంలో ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్దే అన్నారు. గత ఎన్నికల్లో కంటే ఎక్కువగా సీట్లు గెలుస్తామన్నారు. ప్రతిపక్షాలు తిట్లలో పోటీ పడితే.. బీఆర్ఎస్ తెలంగాణను అభివృద్ధి చేయడంలో పోటీ పడుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 23న మెదక్ లో సీఎం కేసీఆర్ పర్యటిస్తారన్నారు. బీఆర్ఎస్ జిల్లా ఆఫీసు, ఎస్పీ ఆఫీస్, జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయాలను ప్రారంభిస్తారని చెప్పారు.


Updated : 19 Aug 2023 1:10 PM GMT
Tags:    
Next Story
Share it
Top