Home > తెలంగాణ > సీఎం జగన్పై కేంద్రానికి హరీష్ రావు ఫిర్యాదు

సీఎం జగన్పై కేంద్రానికి హరీష్ రావు ఫిర్యాదు

సీఎం జగన్పై కేంద్రానికి హరీష్ రావు ఫిర్యాదు
X



Thumb : పోలవరం విస్తరణ ఆపండి..

పోలవరంపై కేంద్రానికి మంత్రి హరీష్ రావు ఫిర్యాదు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్తో సమావేశమయ్యారు. విభజన చట్టం సెక్షన్ 3 కింద నూతన కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు హరీష్ రావు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు విస్తరణ విషయంలో జగన్ సర్కార్ తీరుపై కేంద్రమంత్రికి హరీష్ రావు ఫిర్యాదు చేశారు. పరిమితికి మించి పోలవరం విస్తరణ పనులు చేపడుతున్నారని.. ఏపీ ప్రభుత్వ పనులపై దృష్టి సారించాలని కేంద్రమంత్రిని కోరారు. అదేవిధంగా సమ్మక్క సారక్క, సీతమ్మ ప్రాజెక్టు, పాలమూరు ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు.

జీఎస్టీ సమావేశంలో..

అంతకుముందు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. దాదాపు రూ.700 కోట్లు జీఎస్‌టీ సెస్‌, ఐజీఎస్‌టీ రూ.120 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక మంత్రిని కోరినట్లు హరీశ్‌రావు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మూడేళ్లకు కలిపి రూ.1350 కోట్లు విడుదల కాలేదని హరీష్ రావు ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ ఫండ్స్ ఇతర రాష్ట్రాలకు చెల్లించిన అంశాన్ని పరిష్కరించాలని కోరారు. దీనిపై చాలా కాలంగా అడుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని వివరించారు.

గతంలో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే దీన్ని లేవనెత్తామని, ఆఫీసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామన్న హామీ.. ఇప్పటివరకు అమలుకాలేదన్నారు.

ఇలాంటి అంశాలను సత్వరం పరిష్కరించేందుకు గతంలో హామీ ఇచ్చినట్లుగా ఆఫీసర్ల బృందం లేదా గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రతిపాదనకు నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

minister harish rao meets finance minister nirmala sitharaman

minister harish rao,finance minister,nirmala sitharaman,telangana,cm kcr,brs,bjp,polavaram

Updated : 11 July 2023 4:48 PM GMT
Tags:    
Next Story
Share it
Top