Home > తెలంగాణ > కాంగ్రెస్ ఫిర్యాదుతోనే రైతు బంధు ఆగిపోయింది : హరీష్ రావు

కాంగ్రెస్ ఫిర్యాదుతోనే రైతు బంధు ఆగిపోయింది : హరీష్ రావు

కాంగ్రెస్ ఫిర్యాదుతోనే రైతు బంధు ఆగిపోయింది : హరీష్ రావు
X

రైతుల నోటికాడి ముద్దను కాంగ్రెస్ అడ్డుకుందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే రైతు బంధు నిలిచిపోయిందని ఆరోపించారు. రైతు బంధుకు ఎన్నికల సంఘం అనుమతించిందని మాత్రమే తాను చెప్పానని క్లారిటీ ఇచ్చారు. రైతుబంధుకు ఈసీ అనుమతించిందని.. కానీ కాంగ్రెస్ ఫిర్యాదుతో అది ఆగిపోయిందని చెప్పారు. రైతుబంధు మీద కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జహీరాబాద్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుల ఝూటా మాటలు నమ్మొద్దని సూచించారు.

తెలంగాణ రైతులతో కేసీఆర్ది పేగుబంధం అని హరీష్ రావు అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వొద్దా అని ప్రశ్నించారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రైతులకు బిచ్చం వేస్తున్నారని రేవంత్ అనడం సిగ్గుచేటన్నారు. రైతు బంధును ఎన్ని రోజులు ఆపుతారో చూస్తామన్న మంత్రి.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని.. డిసెంబర్ 3 తర్వాత రైతు బంధు ఇస్తామని చెప్పారు. రైతు బంధు రావాలంటే కాంగ్రెస్ ఖతం అవ్వాలన్న హరీష్ రావు.. రైతు బంధును ఆపిన కాంగ్రెస్ ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు.

Updated : 27 Nov 2023 12:06 PM IST
Tags:    
Next Story
Share it
Top