Home > తెలంగాణ > ఆయన సీఎం కావడం కాదు.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవడు - మంత్రి హరీశ్ రావు

ఆయన సీఎం కావడం కాదు.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవడు - మంత్రి హరీశ్ రావు

ఆయన సీఎం కావడం కాదు.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవడు - మంత్రి హరీశ్ రావు
X

కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అవుతానంటున్న ఆయన.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవరని అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్లు చేశారు. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేయని జానారెడ్డి కూడా సీఎం అవుతానంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో 10 మంది సీఎంలు ఉన్నారని హరీశ్ రావు సటైర్ వేశారు.

బీఆర్ఎస్ హయాంలో కర్ఫ్యూలేని తెలంగాణ చూస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మైనార్టీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, షాదీ ముబారక్ తదితర ప్రథకాలను కేసీఆర్ సర్కారు అమలు చేస్తోందని గుర్తు చేశారు. మైనార్టీ విద్యార్థులకు పోషకాహారం అందించడంతో పాటు 17వేల మంది ఇమామ్‌లకు నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ ఇచ్చారన్న హరీశ్ రావు.. బీఆర్ఎస్కు మళ్లీ అధికారం ఇస్తే రూ.2 కోట్లతో సంగారెడ్డి, సదాశివపేటలో మైనార్టీల కోసం షాదీఖానా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.




Updated : 23 Nov 2023 4:26 PM IST
Tags:    
Next Story
Share it
Top