Home > తెలంగాణ > కాంగ్రెస్ ఆకలైనప్పుడు అన్నం పెట్టలేదు కానీ... : హరీష్ రావు

కాంగ్రెస్ ఆకలైనప్పుడు అన్నం పెట్టలేదు కానీ... : హరీష్ రావు

కాంగ్రెస్ ఆకలైనప్పుడు అన్నం పెట్టలేదు కానీ... : హరీష్ రావు
X

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి హరీష్‌ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు మైనార్టీ, బీసీ బంధు, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అలాగే జీవో నంబర్ 58, 59 ద్వారా లబ్ధిదారులకు రెగ్యులైజేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా విపక్షాలపై మంత్రి విరుచుకుపడ్డారు.ఆకలైనప్పుడు అన్నం పెట్టడం చేతకాని కాంగ్రెస్‌.. అవసరానికి గోరిముద్దలు తినిపిస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలోలేరన్నారు. గత 60 ఏళ్లుగా అభివృద్ధి చేయని కాంగ్రెస్‌ ఇప్పుడు చేస్తానంటే ప్రజలు నమ్మరని విమర్శించారు.

బీజేపీ పాలిత ప్రాంతాల్లో మైనార్టీలు అభద్రతా భావంతో ఉన్నారని హరీష్‌ రావు ఆరోపించారు. కర్ణాటకలో ముస్లిం మైనార్టీలు 90 లక్షల మంది, మహారాష్ట్రలో కోటి 50 లక్షల మంది, బెంగాల్‌లో రెండు కోట్ల 55 లక్షల మంది, ఉత్తరప్రదేశ్‌లో నాలుగు కోట్ల మందికి పైగా ముస్లిం మైనార్టీలు ఉన్నారని తెలిపారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ముస్లిం మైనార్టీల కోసం కనీసం రూ. 2 వేల కోట్లకు మించి బడ్జెట్ కేటాయించలేదని.. కానీ సీఎం కేసీఆర్‌ మైనార్టీ సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 50 లక్షల మంది ముస్లిం మైనార్టీల కోసం రూ. రెండు వేల కోట్ల బడ్జెట్ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.

ప్రజలందరి కోసం పనిచేసే ప్రభుత్వం తమదని హరీష్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరగుతుందని, శుక్రవారం ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని అన్నారు. మెట్రో రైల్ సైతం త్వరలోనే పటాన్చెరు వాసులకు అందుబాటులోకి రానుందని చెప్పారు. అభివృద్ధి చేసే పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు. వచ్చే ఎన్నికల్లోనూ పటాన్ చెరులో గూడెం మహిపాల్ రెడ్డిని గెలిపించాలని, మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేయాలని పిలుపునిచ్చారు.


Updated : 16 Sept 2023 5:15 PM IST
Tags:    
Next Story
Share it
Top