Home > తెలంగాణ > ఓటమి భయంతోనే తెరపైకి జమిలి ఎన్నికలు - హరీష్ రావు

ఓటమి భయంతోనే తెరపైకి జమిలి ఎన్నికలు - హరీష్ రావు

ఓటమి భయంతోనే తెరపైకి జమిలి ఎన్నికలు - హరీష్ రావు
X

తెలంగాణలో జనాలను నమ్మిన నాయకులు నిలబడతారే తప్ప జమిలిని నమ్ముకున్నోళ్లు కాదని మంత్రి హరీష్ రావు అన్నారు. నల్లాలు ఇచ్చిన బీఆర్ఎస్ సర్కారు కావాలో నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలో తేల్చుకోవాలని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని తెలంగాణ సమాజం సెల్ప్ డిక్లరేషన్ చేసుకుందని చెప్పారు.

కేసీఆర్ వల్లే గౌరల్లి ప్రాజెక్టు

తెలంగాణ కోసం గట్టిగా నిలబడే మంచి మనసున్న కుటుంబం కెప్టెన్ లక్ష్మీకాంత రావు కుటుంబమని హరీష్ రావు అన్నారు. అలాంటి కుటుంబానికి చెందిన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ ను మూడోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని తండాలు గ్రామ పంచాయితీలుగా మారాయన్నా.. గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి కావస్తున్నా అదంతా కేసీఆర్ వల్లే సాధ్యమైందని అన్నారు. మిడ్ మానేర్ ద్వారా గోదావరి నీళ్లను హుస్నాబాద్ నియోజకవర్గానికి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నింటినీ అధిగమించి బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసిందని హరీష్ రావు చెప్పారు.

అవన్నీ దొంగ డిక్లరేషన్లు

కాంగ్రెస్ పార్టీవన్నీ దొంగ డిక్లరేషన్లని హరీష్ రావు అన్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రూ.2000 పెన్షన్, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆ పార్టీ చీప్ ట్రిక్కులు మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని కోరారు. కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలతో పాటు చెప్పనివి కూడా నెరవేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా వచ్చినా, కేంద్రం తిప్పలు పెట్టిన ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ చేశారని హరీష్ స్పష్టం చేశారు.

తిట్లు కావాలా కిట్లు కావాలా

రాష్ట్రంలో బీజేపీ బిచాణా ఎత్తేసిందని, ఐదు రాష్ట్రాల్లో ఓడిపోతామన్న భయంతోనే జమిలి ఎన్నికల రాగం అందుకుందని హరీష్ రావు విమర్శించారు. ఇండియా పాకిస్థాన్, హిందూముస్లింల మధ్య కొట్లాట పెట్టి బీజేపీ గెలవాలనుకుంటోందని ఆరోపించారు. నూకలు బుక్కమన్న బీజేపీకి తెలంగాణ ప్రజలు నూకలు లేకుండా చేశారని సటైర్ వేశారు. కాంగ్రెస్, బీజేపీలు తిట్లలో పోటీపడితే బీఆర్ఎస్ కిట్లతో పోటీ పడుతోందన్న మంత్రి.. తిట్లు కావాలంటే కాంగ్రెస్ కు కిట్లు కావాలంటే బీఆర్ఎస్ కి ఓటు వేయాలని పిలుపునిచ్చారు




Updated : 13 Sep 2023 11:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top