ఇంటి నిర్మాణానికి లబ్దిదారుల ఖాతాల్లో 3 లక్షలు వేస్తం : హరీష్ రావు
X
సొంత జాగా ఉన్న వారికి ఇండ్ల నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో వేయబోతున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ నెల 14నుంచి గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణి చేస్తామని చెప్పారు. . సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆరెకటిక సంఘం నూతన భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గతంలో జహీరాబాద్‌లో ట్యాంకర్లతో తాగు నీరు ఇచ్చేవారని.. కానీ సీఎం కేసీఆర్ ఆలోచనతో ఇంటింటికీ నల్లాలు పెట్టి నీళ్లు ఇస్తున్నామన్నారు.
కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వాసుత్రుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. జహీరాబాద్‌లో 50 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్ నిర్మిస్తున్నామన్నారు. త్వరలోనే జహీరాబాద్‌లో 700 డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యమని హరీష్ రావు విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని హరీష్ రావు మండిపడ్డారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మూడు రోజులకు ఒకసారి తాగునీరు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో రూ.600 పింఛన్ ఇస్తున్నారని.. తెలంగాణలో మాదిరిగా రూ.2వేల పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు.