Home > తెలంగాణ > Rythu Bima : రైతు బీమాకు నేటితో ఐదేళ్లు.. రైతు బాంధవుడు కేసీఆర్ అంటూ హరీష్ రావు ట్వీట్

Rythu Bima : రైతు బీమాకు నేటితో ఐదేళ్లు.. రైతు బాంధవుడు కేసీఆర్ అంటూ హరీష్ రావు ట్వీట్

Rythu Bima : రైతు బీమాకు నేటితో ఐదేళ్లు.. రైతు బాంధవుడు కేసీఆర్ అంటూ హరీష్ రావు ట్వీట్
X

రైతుల గురించే కాదు, వారి కుటుంబాల గురించి కూడా ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. అన్నదాతల క‌ష్టాలు తెలిసిన సీఎం వారి సంక్షేమం కోసం ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి అమ‌లు చేస్తున్నారని అన్నారు. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా ప‌థ‌కాలు అమ‌లు చేసి రైతు బాంధవుడిగా మారాడని అభిప్రాయపడ్డారు. రైతు బీమా ప‌థ‌కం అమల్లోకి తెచ్చి నేటితో ఐదేండ్లు పూర్త‌ైన సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు.





ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018, ఆగస్టు 15న ప్రారంభించిన రైతు బీమా పథకం నేటితో ఐదేండ్లు పూర్తి చేసుకున్నదని హ‌రీశ్‌రావు ట్వీట్‌లో రాశారు. అర్హులైన రైతులందరి తరపున ప్రభుత్వమే ఎల్ఐసీకి ప్రీమియం చెల్లిస్తూ, ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందిస్తూ తెలంగాణ స‌ర్కార్ బాసటగా నిలుస్తున్నద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. పథకం ప్రారంభించిన తొలి ఏడాది 2018-19లోనే 31.25 లక్షల మంది రైతులు తమ పేరు నమోదు చేసుకోగా, 2023-24 నాటికి ఆ సంఖ్య 41.04 లక్షలకు పెరిగిందని చెప్పారు. 2018లో ప్రభుత్వం రైతుల తరఫున రూ.602 కోట్లు ప్రీమియం చెల్లించగా నేడు అది రూ. 1477 కోట్లకు చేరిందని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుల తరుపున రూ. 6861 కోట్లు ప్రీమియం రూపంలో చెల్లించగా, వివిధ కారణాలతో ప్రాణం కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ. 5,402 కోట్ల ఆర్థిక సాయం అందించింద‌ని హ‌రీశ్‌రావు చెప్పారు.

గుంట భూమి ఉన్నా రైతుగా గుర్తించి, అన్నదాత మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు అందించే అద్భుతమైన రైతు బీమా పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని హ‌రీశ్‌రావు అభిప్రాయపడ్డారు. రైతుల గురించే కాదు, రైతుల కుటుంబాల గురించి కూడా ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు కేసీఆర్‌ అంటూ హరీష్ రావు కృతజ్ఞతలు చెప్పారు.








Updated : 15 Aug 2023 11:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top