Home > తెలంగాణ > గవర్నర్ మీ పద్ధతి మార్చుకోండి..మంత్రి హరీష్ రావు

గవర్నర్ మీ పద్ధతి మార్చుకోండి..మంత్రి హరీష్ రావు

గవర్నర్ మీ పద్ధతి మార్చుకోండి..మంత్రి హరీష్ రావు
X

బీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ట్విటర్ వేదికగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తాజాగా గవర్నర్ ట్వీట్‎కు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ బీజేపీ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. బుధవారం ట్విటర్ వేదికగా గవర్నర్ ఉస్మానియా పరిస్థితి ఆందోళన కలిగించేదిగా ఉందని ట్వీట్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రిపై సర్కార్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.

గవర్నర్ కామెంట్స్‎పై మంత్రి హరీష్ రావు మీడియా ముఖంగా స్పందించారు." ఉస్మానియా హాస్పిటల్‎పై గవర్నర్ కామెంట్స్ దురదృష్టకరం. కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా ఆమె కామెంట్స్ ఉన్నాయి. గవర్నర్ ప్రభుత్వానికి సలహాలు ఇవ…

Concerned to see the dilapidated condition of the century old prestigious #OsmaniaGeneralHospital. Pride of this citadel of learning &healing must be restored soon https://t.co/YJkXXRSvYT

Updated : 28 Jun 2023 3:09 PM IST
Tags:    
Next Story
Share it
Top