Home > తెలంగాణ > Medaram Jathara : మేడారం జాతరకు జాతీయ హోదాను కేంద్రం పట్టించుకుంటలే : మంత్రి

Medaram Jathara : మేడారం జాతరకు జాతీయ హోదాను కేంద్రం పట్టించుకుంటలే : మంత్రి

Medaram Jathara : మేడారం జాతరకు జాతీయ హోదాను కేంద్రం పట్టించుకుంటలే : మంత్రి
X

మేడారం మహా జాతరకు జాతీయ హోదాను ఇవ్వాలని కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడంలేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. వరంగల్లో దేవదాయ శాఖ సమీకృత భవనాన్ని ఆయన ప్రారంభించారు. రూ.12 కోట్ల నిధులతో మేడారం జాతర ఏర్పాట్లను చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫిబ్రవరి నాటికి పనులను పూర్తి చేస్తామన్నారు.

తెలంగాణ ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుందని ఇంద్రకరణ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ఆలయాల అభివృద్ధి చేపడుతున్నారని చెప్పారు. యాదగిరి గుట్ట ఆలయాన్ని 1200కోట్లతో పునర్నించామన్నారు. అర్చకుల గౌరవ భృతిని 10వేలకు పెంచినట్లు తెలిపారు. కొంతమంది రాజకీయ లబ్ది కోసం మాత్రమే హిందుత్వం అని మాట్లాడుతారే తప్ప అభివృద్ధిని పట్టించుకోరని విమర్శించారు.

జాతర ఎప్పుడంటే..

మేడారం మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24వరకు జరగనుంది. ఫిబ్రవరి 21న కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. అదే రోజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును మేడారం గద్దలపైకి తీసుకొస్తారు. 22న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. 23న వన దేవతలు గద్దెలపై కొలువుదీరుతారు. 24న సమ్మక్క, సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు మళ్లీ వనప్రవేశం చేస్తారు.


Updated : 21 Sep 2023 12:41 PM GMT
Tags:    
Next Story
Share it
Top