Home > తెలంగాణ > చంద్రబాబు వంతయింది.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు: జగదీశ్ రెడ్డి

చంద్రబాబు వంతయింది.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు: జగదీశ్ రెడ్డి

చంద్రబాబు వంతయింది.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు: జగదీశ్ రెడ్డి
X

వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఉండాలా? వద్దా? అనే చర్చ ఎందుకు జరుగుతుందో రాష్ట్ర రైతాంగం ఒకసారి ఆలోచించాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వొద్దన్న కాంగ్రెస్ హైకమాండ్ విధానాన్ని రేవంత్ రెడ్డి ముందే బయటపెట్టాడని తెలిపారు. తన తొందర పాటుతో చంద్రబాబును బయటపడేసిన వ్యక్తి.. నేడు కాంగ్రెస్ అంతరంగాన్ని బయటపెట్టాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కుట్ర చేస్తోందని మండి పడ్డారు. వ్యాపార, వాణిజ్య, పరిశ్రమలు, ఇండ్లకు 24 గంటల కరెంటు ఇవ్వొచ్చు. కానీ, రైతాంగానికి 24 గంటల కరెంటు ఇస్తామంటే ఎందుకు చర్చ పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

గతంలో రాత్రి పూట పొలాలకు వెళ్లిన చాలామంది రైతులు పాము కాటుతో మరణించారని, ఆ మరణాలను తగ్గించడానికే 24 గంటల కరెంట్ అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలన టైంలో కరెంట్ కోసం ఎన్ని ధర్నాలు చేశామో గుర్తు చేసుకోవాలన్నారు. అవినీతిని మూటగట్టుకున్న, రైతాంగాన్ని చావగొట్టిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు దమ్ముంటే.. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో 24 గంటల కరెంట్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 50 లక్షల నుండి కోటి 40 లక్షల మెట్రిక్ టన్నుల సాగు జరగడానికి కారణం కేసీఆర్ అని అన్నారు. అబద్ధాలు చెప్పి, భూతులు తిట్టడం వల్ల చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు.

Updated : 15 July 2023 2:17 PM IST
Tags:    
Next Story
Share it
Top