Komatireddy Venkat Reddy : అది ఇవ్వకపోతే హారీశ్ రావు బీజేపీలోకే..కోమటి రెడ్డి
X
యాదాద్రిని ఇకపై యాదగిరిగుట్టగా మారుస్తామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీఓ విడుదల చేస్తామని చెప్పారు. శనివారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన..కేటీఆర్ కి నాలెడ్జ్ లేదన్నారు. కేటీఆర్ ఇప్పటికీ తండ్రి కేసీఆర్ చాటు కొడుకేనని విమర్శించారు. తాను ఉద్యమాలు చేసి వచ్చానని.. మేం జీరో బిల్ ఇచ్చినట్టు, కేటీఆర్‌కి జీరో నాలెడ్జ్ ఉందని దుయ్యబట్టారు. అసలు నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం అనవసరమని అభిప్రాయపడ్డారు. అంతేగాక ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ రావు కూడా బీజేపీలోకి జంప్ అవుతాడని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తే..కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం పనికిరాదని ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి కేసీఆర్‌ను నామరూపాలు లేకుండా చేశారన్నారు. ఎంపీ అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేయమని రాహుల్ గాంధీని కోరినట్లు చెప్పారు. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో..సౌత్ తెలంగాణలో భారీ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రధాని మోదీ కంటే రాహుల్ గాంధీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తారుని మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.