Home > తెలంగాణ > Komatireddy Venkat Reddy : ముఖం చూపించలేక జగదీశ్ రెడ్డి సభకు రాలేదు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy : ముఖం చూపించలేక జగదీశ్ రెడ్డి సభకు రాలేదు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy  : ముఖం చూపించలేక జగదీశ్ రెడ్డి సభకు రాలేదు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ దారుణంగా మోసం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలు కలిసి దక్షిణ తెలంగాణను నాశనం చేశారని మండిపడ్డారు. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించారని విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 11 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు దాదాపు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి తలెత్తిందని గుర్తుచేశారు. కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండలో అడుగుపెట్టాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇరిగేషన్ శాఖపై చర్చ జరగుతున్న రోజున జగదీశ్ రెడ్డి సభకు రాకపోవడాన్ని వెంకట్ రెడ్డి తప్పుబట్టారు. 10 ఏండ్లు మంత్రిగా ఉన్న ఆయన సభకు మొఖం చూపించలేక అసెంబ్లీకి డుమ్మాకొట్టారని అన్నారు. తెలంగాణ వాటా నీళ్లను కేసీఆర్ ఒకడుగు ముందుకేసి తమకు ఇచ్చారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారని, ఇప్పుడు మీ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సాగర్ నుంచి నీళ్లు వచ్చేవని, బీఆర్ఎస్ హయాంలో తాగునీళ్లు లేక జనం ఇబ్బందులు పడ్డారని ఫైర్ అయ్యారు.




Updated : 12 Feb 2024 1:25 PM IST
Tags:    
Next Story
Share it
Top