Komatireddy Venkat Reddy : కాళేశ్వరం డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు : కోమటిరెడ్డి
X
మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని ఆరోపించారు. కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ అని సెటైర్ వేశారు. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వేస్ట్ అని విమర్శించారు. కేటీఆర్ లాగా తండ్రి పేరు చెప్పుకుని తాను రాజకీయాల్లోకి రాలేదని.. ఉద్యమాలు చేసి వచ్చానని తెలిపారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్నట్లు చెప్పారు. కాళేశ్వరం డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ సందర్శనకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
మేడిగడ్డ పనికిరాదని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిందని కోమటిరెడ్డి చెప్పారు. కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెప్తి ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. రాహుల్ గాంధీని భువనగిరి నుంచి పోటీ చేయాలని కోరామని కోమటిరెడ్డి తెలిపారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోదీ కంటే రాహుల్కే ఎక్కువ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తామన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.