Home > తెలంగాణ > komatireddy Venkata Reddy : కాంగ్రెస్‌ను టచ్ చేస్తే నామరూపాలు లేకుండా చేస్తాం..

komatireddy Venkata Reddy : కాంగ్రెస్‌ను టచ్ చేస్తే నామరూపాలు లేకుండా చేస్తాం..

komatireddy Venkata Reddy : కాంగ్రెస్‌ను టచ్ చేస్తే నామరూపాలు లేకుండా చేస్తాం..
X

కాంగ్రెస్ పై బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని, కాంగ్రెస్ ను టచ్ చేస్తే నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. బీజేపీ- బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. కొందరు బీజేపీ పెద్దలే తనకు ఈ విషయం చెప్పారన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లేది తన కొడుకు కేటీఆర్ గురించేనని, కేటీఆర్ కు ఆశీస్సులు ఇవ్వాలని గతంలో ప్రధాని మోదీని కేసీఆర్ కోరారన్నారు కోమటిరెడ్డి.

కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని , ఢిల్లీ పర్యటనలో చాలా అభివృద్ధి పనులకు తాము నిధులు మంజూరు చేయించుకున్నామన్నారు. రూ.700 కోట్లతో నల్గొండ బైపాస్ రోడ్ మంజూరు చేసినందుకు గడ్కరీకి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వారంలో భూమి సేకరించి టెండర్లు పిలుస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేతగానితనంతో ఆర్ఆర్ఆర్ పని ఆగిపోయిందన్నారు.

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ అందరికీ తెలుసని అన్నారు. మహారాష్ట్రలో కూల్చిన విధంగా.. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడం కుదరదని ఫైర్ అయ్యారు. ఇన్నాళ్లు బీజేపీని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరినీ జైలుకు పంపారని, అదే తెలంగాణ సంపదను ప్రాజెక్టుల పేరిట దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ పెద్దలు ఎందుకు జైలుకు పంపడం లేదంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించారని, అయితే, ఆ నియామకాన్ని అందరూ ‘కిషన్‌ రెడ్డి.. నామినేటెడ్ బై కేసీఆర్’ అన్నారంటూ పొన్నం ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు.

Updated : 21 Feb 2024 8:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top