పార్టీకి మంత్రి కొండా సురేఖ విరాళం.. ఎంతంటే?
X
కాంగ్రెస్ పార్టీని స్థాపించి 138 ఏళ్లు అవుతున్న సందర్భంగా 'డొనేట్ ఫర్ దేశ్' పేరు మీద విరాళాలు సేకరిస్తోంది ఆ పార్టీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి విరాళం అందించారు. మొత్తం లక్షా ముప్పై ఎనిమిది వేల నూట ముప్పై ఎనిమిది (138138 ) రూపాయలు విరాళంగా ఇచ్చారు. పార్టీని స్థాపించి 138 ఏళ్లవుతున్న సందర్భంగా.. ఆ నంబర్ వచ్చేలా మంత్రి తన విరాళం మొత్తాన్ని అందించారు. దేశానికి ఉజ్వల భవిష్యత్తు అందించడానికి కాంగ్రెస్ పార్టీతో చేయి కలపాలని, పార్టీకి విరాళం అందించాలని మంత్రి కోరారు. ఇక మంత్రి కొండా సురేఖ విరాళంపై తెలంగాణ కాంగ్రెస్ స్పందించింది. ఈ మేరకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి విరాళాలు అందించాలని కోరింది. అందుకోసం donateinc.netని సంప్రదించాలని సూచన చేసింది. కాగా 1885 డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ మొదటి అధ్యక్షుడు W.C బెనర్జీ కాగా.. మల్లికార్జున ఖర్గే ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నారు.