నా బాధ్యతను నెరవేర్చా..మంచి నాయకుడికి ఓటు వేశా : మంత్రి కేటీఆర్
Aruna | 30 Nov 2023 11:12 AM IST
X
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఎప్పట్లాగే పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలు, నిబంధనల ఉల్లంఘన, ఈవీఎంల మొరాయింపు తదితర సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయినా ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు పొద్దుపొద్దునే బూత్ లకు వెళ్లి ఓటేస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లోని నందీనగర్‌లో కేటీఆర్ తన సతీమణి శైలిమాతో కలిసి ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. " ఓ పౌరుడిగా నా బాధ్యతను నేను నెరవేర్చాను. రాష్ట్రాన్న ప్రగతి మార్గంలో నడిపించే ఓ మంచి నాయకుడికి నేను ఓటు వేశాను. హైదరాబాదీలు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు వేసి మీ హక్కును కాపాడుకోవాలి" అని కేటీఆర్ కోరారు.
Updated : 30 Nov 2023 11:12 AM IST
Tags: Minister KTR BRS Leader KTR KTR wife shailima voting polling elections Ts elections Telangana assembly elections 2023 nandi nagar banjarahills hyderabad telangana
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire