Kamareddy Master Plan: ప్రగతి భవన్లో కామారెడ్డి రైతులతో కేటీఆర్ భేటీ..
X
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కామారెడ్డి రైతు జేఏసీ సభ్యులు కలిశారు. ప్రగతి భవన్ కు వచ్చిన అన్నదాతలతో ఆయన సమావేశం అయ్యారు. అనంతరం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను రద్దు చేస్తున్టన్లు ప్రకటించారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని.. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. మరోసారి డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్... ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మాస్టర్ ప్లాన్ రద్దు ప్రకటనపై రైతు జేఏసీ నేతలు కేటీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు. మంత్రి ఇచ్చిన హామీపై భరోసా ఉందని అన్నారు. రైతు జేఏసీ చేపట్టిన ఆందోళనల సందర్భంగా నమోదైన కేసులను కూడా ఎత్తి వేసేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. కేసుల వివరాల గురించి జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్న ఆయన.. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్తో కూడా మాట్లాడారు.