KTR : కొందరు శిఖండి రాజకీయాలు చేస్తున్నరు - మంత్రి కేటీఆర్
X
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సూర్యాపేటలో ఎవరికి డిపాజిట్ రాదో తేల్చుకుందామని అన్నారు. సూర్యాపేటలో ఐటీ హబ్‌ను ప్రారంభించిన అనంతరం సభలో పాల్గొన్న కేటీఆర్ ఈ కామెంట్లు చేశారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా ఎన్ని కుట్రలు చేసినా జగదీష్ రెడ్డి విజయాన్ని ఆపలేరని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో యుద్ధం నేరుగా చేయాలని, చేసింది చెప్పాలని కోమటిరెడ్డికి చురకలంచించారు. 55 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, 10ఏండ్లు అధికారంలో ఉన్నామని చెప్పుకుంటున్న బీజేపీ ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
నేతలెవరైనా దమ్ముంటే నేరుగా కొట్లాడాలన్న కేటీఆర్.. కొందరు మాత్రం శిఖండి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 2000 సంవత్సరంలో కేసీఆర్‌కు ఒక తమ్ముడిలా జగదీష్ రెడ్డి ఉద్యమంలో వెంట నడిచారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సాధిస్తాడనే నమ్మకంతో ఒక సైనికుడిలాగా 24 ఏండ్ల కిందట ఆయన కేసీఆర్ వెంట నడిచారని, ఇప్పుడు కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.