Home > తెలంగాణ > బీజేపీ ఐడియాలజీతో కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ - మంత్రి కేటీఆర్

బీజేపీ ఐడియాలజీతో కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ - మంత్రి కేటీఆర్

బీజేపీ ఐడియాలజీతో కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ - మంత్రి కేటీఆర్
X

కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మైనార్టీలను బీసీల్లో చేరుస్తామన్న ఆ పార్టీ ప్రతిపాదనను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. బీజేపీ ఐడియాలజీతోనే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించినట్లు ఉందని సటైర్ వేశారు. మైనార్టీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు.

తప్పుడు హామీలు ఇవ్వడం కాంగ్రెస్ కు కొత్తేమీ కాదని కేటీఆర్ అన్నారు. గతంలోనూ చాలాసార్లు ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ముస్లిం మైనార్టీలను బీసీలుగా గుర్తిస్తే వారికి వారికి ప్రత్యేక హోదా పోతుందని స్పష్టం చేశారు. మైనార్టీ డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ బీసీలు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని విమర్శించారు. మైనార్టీలకు కులగణనతో సంబంధం లేదని, ఇదంతా బీజేపీ కుట్రలాగా కనిపిస్తోందన్న కేటీఆర్.. కాంగ్రెస్‌ వెంటనే ఈ డిక్లరేషన్‌ను ఉపసంహరించుకోవాలిని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కై ఆటలాడుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ కీలక నేతలు బరిలో ఉన్న సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ వీక్‌ క్యాండిడేట్స్‌ను నిలబెట్టిందని అన్నారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పదేళ్లు మైనార్టీల కోసం కేవలం రూ.930 కోట్లు ఇస్తే.. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు.



Updated : 10 Nov 2023 1:24 PM GMT
Tags:    
Next Story
Share it
Top