Home > తెలంగాణ > నమో అంటే నమ్మించి మోసం చేయడం : కేటీఆర్

నమో అంటే నమ్మించి మోసం చేయడం : కేటీఆర్

నమో అంటే నమ్మించి మోసం చేయడం : కేటీఆర్
X

నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్లో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. రైతుల రుణమాఫీ జరగలేదని మోదీ మాట్లాడడం పెద్ద జోక్ అని విమర్శించారు. ‘‘ అన్నదాత అప్పులు మాఫీ చేసిన జైకిసాన్ ప్రభుత్వం మాది.. కార్పొరేట్ దోస్తులకు 14.5 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన నై కిసాన్ సర్కారు మోదీది అంటూ అని మండిపడ్డారు. దీనికి సంబంధించి కేటీఆర్ ట్వీట్ చేశారు.

‘‘బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కేసీఆర్ గారి చేతిలోనే పదిలంగా ఉంది. కానీ బీజేపీ స్టీరింగ్..అదాని చేతిలోకి వెళ్లిపోయింది. కేంద్రం కిసాన్ సమాన్ కింద ఇచ్చింది నామమాత్రం.. కానీ చిన్న రాష్ట్రమైన తెలంగాణ 70 లక్షల మంది రైతులకు 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం మోదీ తెలుసుకుంటే మంచిది. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు రైతుల రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక సందర్భం తెలంగాణలోనే ఆవిష్కృతమైంది. కర్షకుల రక్తం కండ్ల జూసిన రైతుహంతక రాజ్యం మీది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణో బీజేపీ నూకలు చెల్లిపోయాయని కేటీఆర్ అన్నారు. ‘‘పదేళ్లపాటు విభజన హామీలను పాతరేసి.. మీ ఎన్నికల హామీలను గాలికి వదిలేసి ఓట్ల వేటలో ఇప్పుడొచ్చి మాట్లాడితే నమ్మేదేవరు. ప్రాజెక్టులు వల్ల చుక్క నీరు రాలేదనడం మీ అవివేకానికి నిదర్శనం. తెలంగాణలో సాగుతోంది సాగునీటి విప్లవం. తెలంగాణ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన మీరా మాట్లాడేది..తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనమంటే నూకలు తినమన్న మీ కేంద్ర పెద్దల అవమానకర మాటలు తెలంగాణ రైతులు మరిచిపోలేదు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు ప్రపంచ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప మానవ నిర్మిత అద్భుతాలు. భవిష్యత్తు ఇరిగేషన్ రంగానికే సరికొత్త పాఠాలు. వీటిపై మీ ఆరోపణలు.. పూర్తిగా అవాస్తవాలు.’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Updated : 1 Oct 2023 2:36 PM GMT
Tags:    
Next Story
Share it
Top