Home > తెలంగాణ > KTR : కొడుకును మిస్ అవుతున్న కేటీఆర్.. ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్

KTR : కొడుకును మిస్ అవుతున్న కేటీఆర్.. ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్

KTR : కొడుకును మిస్ అవుతున్న కేటీఆర్.. ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్
X

కేటీఆర్.. ఇటు పార్టీ పనులు, అటు అధికార పనులతో నిత్యం బిజీగా ఉంటారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఆయన్ని అంతా నెక్ట్స్ సీఎం అని అంటారు. ఎప్పుడూ బిజీ ఉండే కేటీఆర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అదీ తన కొడుకు విషయంలో.. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నాడు. అగస్ట్లో అయన అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో కేటీఆర్ కూడా హిమాన్షుతో పాటే వెళ్లి జాయినింగ్ ప్రొసీసర్ చూసుకున్నారు. తాజాగా కొడుకును మిస్ అవుతున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి తన కొడుకుతో కలిసి ఉన్న ఫొటోను జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. హిమాన్షు కూడా మిమ్మల్ని మిస్ అవుతుండొచ్చు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.




Updated : 11 Oct 2023 12:27 PM IST
Tags:    
Next Story
Share it
Top