కరువు, కర్ఫ్యూ లేదు.. కళ్ల ముందే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి : కేటీఆర్
X
గత 9 ఏళ్లలో లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కానీ కాంగ్రెస్ 2004 -14 వరకు కేవలం 24వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు బాధపడిందన్నారు. కర్నాటకలో 5 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని.. కానీ తెలంగాణలో 6గ్యారెంటీలు అంటూ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఐటీ రంగంలో 400శాతం అభివృద్ధి చెందామన్న మంత్రి.. హైదరాబాద్ బెంగళూరును మించిపోయిందని చెప్పారు.
తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని కేటీఆర్ అన్నారు. దేశ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. మైగ్రేషన్కు పర్యాయంగా ఉన్న పాలమూరు ఇప్పుడు ఇరిగేషన్కు మారుపేరుగా మారిందన్నారు. 9ఏళ్లలో కరువు, కర్ఫ్యూ లేదని.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కళ్ల ముందే కన్పిస్తోందని చెప్పారు. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. గురుకులాల్లో20వేల 800 టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతోపాటు పోడు భూములకు పట్టాలిచ్చామన్నారు.
రాష్ట్రంలో ఫ్లోరోసిస్ను రూపమాపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు.