Home > తెలంగాణ > కాంగ్రెస్ వస్తే పరిశ్రమలన్నీ కర్నాటకకు పోతయి - మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ వస్తే పరిశ్రమలన్నీ కర్నాటకకు పోతయి - మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ వస్తే పరిశ్రమలన్నీ కర్నాటకకు పోతయి - మంత్రి కేటీఆర్
X

తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో నెహ్రూ, ఇందిరతో ఇప్పుడు మోడీతో కొట్లాడుతున్నారని చెప్పారు. జలవిహార్లో ఏర్పాటు చేసిన న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సీఎంలు దొరికారు కానీ ఓటర్లు దొరకడం లేదని అన్నారు. జానారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయరు గానీ సీఎం పదవి మాత్రం కావాలంటారని సటైర్ వేశారు.

రాష్ట్రంలో 24వేల పరిశ్రమలు కొత్తగా వచ్చాయని, ఐటీ ఎగుమతులు రూ.10లక్షల కోట్లకు చేరుకున్నాయని కేటీఆర్ అన్నారు. మనం ఎంతో కష్టపడి ఫాక్స్ కాన్ కంపెనీని తెలంగాణకు తీసుకొస్తే.. కర్నాటక డిప్యూటీ సీఎం శివ కుమార్ కంపెనీని బెంగుళూరుకు మార్చాలని సీఈఓకు లేఖ రాశారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుందని, అక్కడున్న ప్రముఖ కంపెనీలన్నీ బెంగళూరుకు మార్చేస్తామని లేఖలో రాయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లెక్కన చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కర్నాటకకు పోతాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

కేసీఆర్ మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో అభివృద్ధి అందరికీ కనిపిస్తున్నా, విపక్షాలకు కనిపించడంలేదని విమర్శించారు. కేసీఆర్ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరించరు. తెలంగాణ సీఎం ఎవరన్నది ప్రజలే నిర్ణయించాలే తప్ప మోడీ, రాహుల్ గాంధీ కాదని, ఈ పోరాటం ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Updated : 4 Nov 2023 3:45 PM IST
Tags:    
Next Story
Share it
Top