రాబందుల కాలం పోయి.. రైతుబంధు కాలం వచ్చింది : కేటీఆర్
X
రైతులను అవమానించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రైతులకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు గంటల కరెంట్ చాలు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా అని ప్రజలు ఆలోచించాలని సూచించారు. 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని చెప్పారు. రైతుల కోసమే ధరణి, రైతు బంధు తీసుకొచ్చామని.. కానీ వాటిని బంగాళాఖాతంలో కలుపుతామంటూ కాంగ్రెస్ నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు.minister ktr fires on revanth reddy and congress party
ప్రజలు బాగుండాలనేది తమ పోరాటం అయితే.. అధికారంలో ఉండాలనేది కాంగ్రెస్ ఆరాటం అని కేటీఆర్ ఆరోపించారు. గత పదేళ్లలో అన్ని వర్గాల అభ్యన్నతే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు. రాబంధుల కాలం పోయి.. రైత బంధు కాలం వచ్చిందని చెప్పారు. మోటార్లుకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెచ్చినా.. రైతుల కోసం ఒప్పుకోలేదని చెప్పారు. రైతుల కోసం 30వేల కోట్ల నష్టాన్ని భరిస్తున్నామని వివరించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు చిత్తు కాగితాలతో సమానమని మండిపడ్డారు.