జీహెచ్ఎంసీలో వార్డు పాలన.. కాచీగూడలో వార్డ్ ఆఫీస్ ప్రారంభించిన కేటీఆర్
X
జీహెచ్ఎంసీలో సరికొత్త పాలన ప్రారంభమైంది. వార్డు పాలనకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. కాచీగూడలో వార్డు ఆఫీసును ఆయన ప్రారంభించారు. పౌర సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డులో 10 మంది అధికారులు అందుబాటులో ఉంటారు. పారిశుద్ధ్యం, విద్యుత్, టౌన్‌ప్లానింగ్ వంటి వాటిపై ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించనున్నారు.
పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. వికేంద్రీకరణ, ప్రజలు కేంద్రంగా పాలనే తమ లక్షమన్నారు. వార్డు కార్యాలయాల్లోనే కనీస పౌరసేవలు, ఫిర్యాదులు పరిష్కారమవుతాయని చెప్పారు. సిటిజన్ చార్టర్‌కు అనుగుణంగా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. ప్రతి డివిజన్ కార్యాలయంలో 10 మంది అధికారుల బృందం ఉంటుందని, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు.