వర్షాలపై రాజకీయాలు తగదు.. చేతనైతే సాయం చేయండి : కేటీఆర్
X
తెలంగాణను భారీ వర్షాలు భయపెట్టిస్తున్నాయి. ఊర్లకు ఊర్లే వరదల్లో మునిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వానలు కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. ప్రాజెక్టులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక భారీ వర్షాలకు హైదరాబాద్ అల్లకల్లోమవుతోంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ హుస్సేన్ సాగర్ సహా మూసి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. వరద పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు.
భారీ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్కు భారీ వరద వస్తుందని కేటీఆర్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండే ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలపై సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారని చెప్పారు
విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని కేటీఆర్ హితవు పలికారు. చేతనైతే ప్రజలకు సాయం చేయాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం 24గంటలు పనిచేస్తున్న విషయాలన్ని విపక్షాలు గుర్తుంచుకోవాలన్నారు. గతంలో భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేవని.. కానీ ఎస్సార్డీపీ పనులతో వరద ప్రభావం తగ్గిందన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగ్గకుండా అన్నీ ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి @KTRBRS పర్యటించారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. అనంతరం చాదర్ ఘాట్ మూసీ నది లో-లెవెల్ వంతెన వద్ద వరదను పరిశీలించారు.#HyderabadRains pic.twitter.com/q4zaRbDnsy
— BRS Party (@BRSparty) July 27, 2023