Home > తెలంగాణ > హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

హైద‌రాబాద్ భ‌విష్య‌త్ కోసం భారీగా మెట్రో విస్త‌ర‌ణ చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో నగరానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మెట్రో రైల్ మాస్ట‌ర్ ప్లాన్‌పై గురువారం కేటీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్రో విస్త‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు కార్యక్రమాలనే వేగవంతం చేయాలన్నారు.

48 ఎక‌రాల భూమిని మెట్రో డిపో కోసం అప్ప‌గించాల‌ని జీఎంఆర్ అధికారులను మంత్రి ఆదేశించారు. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గాలంటే, మెట్రోను విస్తరించాల్సి అవసరం ఉందని చెప్పారు. మ‌రిన్ని కోచ్‌ల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని సూచించారు. ఫీడ‌ర్ సేవ‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డంతో పాటు ఫుట్‌పాత్‌ల‌ను అభివృద్ధి చేయాల‌న్నారు. మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల కోసం ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత మెట్రో స్టేషన్‌లకు సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాల‌ని కేటీఆర్ ఆదేశించారు. మెట్రో విస్తరణ కోసం అవసరమైన నిదుల సేకరణకు ఉన్న అవకాశాలను వేగంగా పరిశీలించాలని ఆర్థిక, పురపాలక శాఖ అధికారులకు కేటీఆర్ సూచించారు.



Updated : 10 Aug 2023 2:34 PM GMT
Tags:    
Next Story
Share it
Top