KTR Comments: ప్రవళిక ఆత్మహత్యపై కేటీఆర్ సంచలన కామెంట్స్..
X
ప్రవళిక ఆత్మహత్య తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. గ్రూప్ 2, డీఎస్సీ వాయిదా వేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాలు సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే శివరామ్ వేధింపుల వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రవళిక కుటుంబసభ్యులు సైతం శివరామ్ వేధింపుల వల్లే తమ కూతురు మరణించిందని.. అతడిన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రవళిక మృతిని కొంతమంది రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆమె మృతిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘‘ప్రవళిక కుటుంబసభ్యులు నా దగ్గరకి వచ్చారు. మా అమ్మాయికి అన్యాయం జరిగింది. మా అమ్మాయిని ఓ యువకుడు వేధించి చంపేసిండు.. న్యాయం చేయాలని కోరారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చా. ప్రవళిక తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు.