Home > తెలంగాణ > లోకేష్ ట్వీట్ చూసి బాధ కలిగింది : కేటీఆర్

లోకేష్ ట్వీట్ చూసి బాధ కలిగింది : కేటీఆర్

లోకేష్ ట్వీట్ చూసి బాధ కలిగింది : కేటీఆర్
X

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని లోకేష్ ట్వీట్ చేశారు. చంద్ర‌బాబును అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే ప్ర‌ణాళిక ఏదో జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబుకు ఏం జరిగిన జగన్ దే బాధ్యత అని అన్నారు. ఇక ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు.

నారా లోకేష్ ట్వీట్ బాధ కలిగించిందని కేటీఆర్ అన్నారు. కొడుకుగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళ‌న ఎలా ఉంటుందో తెలుసని అన్నారు. ‘‘కేసీఆర్ నిరాహార దీక్ష స‌మ‌యంలో నేను ఆందోళన చెందాను. హైద‌రాబాద్ ప్ర‌శాంతంగా ఉండాల‌నే ఇక్క‌డ ఆందోళ‌న‌లు వ‌ద్దంటున్నాం’’ అని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం కేటీఆర్ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.


Updated : 13 Oct 2023 9:29 PM IST
Tags:    
Next Story
Share it
Top