Home > తెలంగాణ > KTR : అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కత్తి దాడి... కేటీఆర్ ట్వీట్..

KTR : అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కత్తి దాడి... కేటీఆర్ ట్వీట్..

KTR : అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కత్తి దాడి... కేటీఆర్ ట్వీట్..
X

అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న ఖమ్మం విద్యార్థిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉంది. ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌ రాజ్‌ (29) అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్శిటీలో ఎంఎస్‌ చదువుతున్నాడు. మంగళవారం వరుణ్‌ జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఒక దుండగుడు కత్తితో అతడిపై దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకొని దాడి చేసిన వ్య‌క్తిని అరెస్టు చేశారు. దాడికి పాల్పడింది జోర్డాన్ ఆండ్రేడ్ అనే వ్యక్తిగా గుర్తించి. అతనిపై హ‌త్యాయ‌త్నం కింద కేసు బుక్ చేశారు. వరుణ్‌ను చికిత్స నిమిత్త ఫోర్ట్ వెయిన్ హాస్పిట‌ల్‌కు తరలించారు. వ‌రుణ్ కండీష‌న్ సిరీయ‌స్‌గా ఉంద‌ని అధికారులు అంటున్నారు.

అమెరికాలో తెలుగు విద్యార్థిపై దాడి కేసులో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. వారికి కావాల్సిన సహాయసహకారాలను అందిస్తామని తెలిపారు. అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై స్నేహితుల సహాయంతో వరుణ్‌కు కావాల్సిన సహకారాన్ని అందించడానికి తమ వంతు కృషి చేస్తామని.. కేటీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు. వరుణ్ కుటుంబసభ్యులతో తన టీం టచ్ లో ఉంటారని, కావాల్సిన సహాయం అందిస్తారని చెబుతూ..వరుణ్ పరిస్థితిపై మానసా కాపురి అనే డాక్టర్ చేసిన ట్వీట్ ను షేర్ చేశారు మంత్రి కేటీఆర్. . మరోవైపు మహబూబాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వరుణ్‌ రాజ్‌ తండ్రి రామ్మూర్తి మంగళవారం రాత్రి మంత్రి పువ్వాడ అజయ్‌ను కలిశారు. తన కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని ఆయన మంత్రిని కోరారు.




Updated : 1 Nov 2023 4:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top