Home > తెలంగాణ > హైదరాబాద్ వాసులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్..

హైదరాబాద్ వాసులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్..

హైదరాబాద్ వాసులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్..
X

జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లుపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే వారమే అర్హులైన లబ్దిదారులకు తొలి విడతలో ఇళ్లను కేటాయిస్తామని మంత్రి తెలిపారు. డబుల్ బెడ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపై ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని కేటీఆర్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి , డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం చేసిన ప్రకటన నేపథ్యంలో పంపిణీ ప్రక్రియను జీహెచ్ఎంసీ మరింత వేగవంతం చేసింది.





జీఎహెచ్ఎంసీలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం వాటిని వేగం పూర్తి చేస్తుందని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే 75 వేల ఇళ్ల నిర్మాణం పూర్తైందని చెప్పారు. సుమారు 4500కు పైగా ఇళ్లను ఇన్ సిట్యూ లబ్దిదారులకు అందించారని.. నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా 70 వేల ఇళ్ళను ఐదారు విడతల్లో అందిస్తామని స్పష్టం చేశారు. వచ్చే వారంలోనే మొదట దశ ప్రారంభమవుతోందన్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లను చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను కేటీఆర్ ఆదేశించారు. ఎన్నికల నాటికి హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి కావాలని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో గృహలక్ష్మి ఇళ్ల నిర్మాణంపై కూడా సమావేశంలో చర్చించారు





డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రక్రియ పంపిణీ పైన మంత్రులు పలు సూచనలను తెలియజేశారు. లబ్దిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పూర్తిగా అధికార యంత్రాంగమే పరిశీలన చేసి అర్హులను గుర్తిసోందని వివరించారు. నగర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఇండ్లపంపిణీ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.


Updated : 16 Aug 2023 6:33 PM IST
Tags:    
Next Story
Share it
Top