Home > తెలంగాణ > ధరణిలో ఉన్న చిన్న చిన్న లోపాలు సరిచేస్తాం - మంత్రి కేటీఆర్

ధరణిలో ఉన్న చిన్న చిన్న లోపాలు సరిచేస్తాం - మంత్రి కేటీఆర్

ధరణిలో ఉన్న చిన్న చిన్న లోపాలు సరిచేస్తాం - మంత్రి కేటీఆర్
X

రైతులను ముప్పు తిప్పలు పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ రద్దు చేస్తామంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. పట్వారీ వ్యవస్థ కావాలా? ధరణి కావాలా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీయే రైతన్నకు భరోసా అన్న కేటీఆర్.. ధరణి ెత్తేస్తే దళారుల రాజ్యం వస్తుందని అన్నారు. 24 గంటల కరెంట్‌ కావాలనుకునే వారు బీఆర్ఎస్కు ఓటు వేయాలని సూచించారు.

తెలంగాణపై కేసీఆర్ కున్న ఉన్న ప్రేమ రాహుల్ గాంధీ, ప్రధాని మోడీకి ఉంటుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. మరి అలాంటప్పుడు మనోడిని గెలిపించుకుందామా లేక ఢిల్లీ వాళ్లను నెత్తిన పెట్టుకుందామా అని అడిగారు.కామారెడ్డికి వ‌స్తున్న కేసీఆర్‌ను ఆశీర్వ‌దిస్తే ప్రాంతం రూపురేఖ‌లు మారిపోతాయని చెప్పారు. కేసీఆర్ వ‌స్తే ప్రతి గ్రామంలో బ్ర‌హ్మాండ‌మైన అభివృద్ధి జ‌రుగుతుందని, పొలాల‌కు కాళేశ్వ‌రం నీళ్లు వ‌స్తాయని అన్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే తెల్లరేషన్‌ కార్డు ఉన్నవాళ్లందరికీ సన్న బియ్యం ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు ₹3వేలు, రేషన్‌కార్డున్న ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ధరణిలో ఉన్న చిన్న చిన్న లోపాలు సరిచేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Updated : 18 Nov 2023 9:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top