కాంగ్రెస్, బీజేపీ కలిసి కొత్త కుట్రకు తెరలేపాయి : కేటీఆర్
X
కాంగ్రెస్, బీజేపీ కలిసి కొత్త కుట్రకు తెరలేపి రైతుబంధును ఆపేశాయని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ కొత్తది కాదని.. చెత్త పార్టీ అని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటున్నారని.. కానీ ఇప్పటివరకు 11సార్లు అవకాశం ఇస్తే కరెంట్, పెన్షన్లు, తాగు, సాగునీరు ఇవ్వలేకపోయిందని అన్నారు. అటువంటి అవకాశమిస్తే రాష్ట్రం మళ్లీ ఆగమైతదని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తాన్బాద్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి రాకముందే రైతు బంధును కాటగలిపి రైతుల నోట్లో మట్టిగొట్టారని మండిపడ్డారు.
గత 50 పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదని కేటీఆర్ విమర్శించారు. 55ఏళ్ల తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెట్టి.. వారి బతుకులను నాశనం చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఏం చేశారని అంటున్నారని.. కానీ రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మీ,కేసీఆర్ కిట్ వంటి పథకాలు తెచ్చిందే కేసీఆర్ అని చెప్పారు. బతుకులు బాగుచేసిన కేసీఆర్‌ను వద్దని.. 55 ఏళ్లు మనల్ని సావగొట్టిన కాంగ్రెసే ముద్దని కొందరు అనడం సిగ్గుచేటని విమర్శించారు.
కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలో ఆలోచించుకోవాలని సూచించారు. తెలంగాణను ఢిల్లీ చేతుల్లో పెట్టొద్దని కోరారు.