Home > తెలంగాణ > కర్నాటక ప్రజలు చేసిన తప్పును తెలంగాణ ప్రజలు చేయొద్దు : కేటీఆర్

కర్నాటక ప్రజలు చేసిన తప్పును తెలంగాణ ప్రజలు చేయొద్దు : కేటీఆర్

కర్నాటక ప్రజలు చేసిన తప్పును తెలంగాణ ప్రజలు చేయొద్దు : కేటీఆర్
X

తెలంగాణలో 3గంటల కరెంట్ కావాలా.. 24గంటల కరెంట్ కావాలా అని మంత్రి కేటీఆర్ అడిగారు. కాంగ్రెస్ను గెలిపిస్తే 3గంటల కరెంట్ మాత్రమే వస్తుందని.. రేవంత్ రెడ్డి సైతం ఇదే మాట చెబుతున్నారని ఆరోపించారు. ఆ పార్టీని నమ్మి మోసపోకుండా బీఆర్ఎస్ను గెలిపిస్తే 24గంటల కరెంట్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ను నమ్మి మోసపోయిన కర్నాటక ప్రజలు కరెంట్ లేక తిప్పలు పడుతున్నారని.. ఆ తప్పును తెలంగాణ ప్రజలు చేయొద్దన్నారు. పెద్దపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.

అన్ని వర్గాలను కాంగ్రెస్ దూరం చేసుకుందని కేటీఆర్ ఆరోపించారు. 11సార్లు అవకాశం ఇచ్చినా.. మళ్లీ ఒక్క ఛాన్స్ అంటున్నారని.. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మొద్దన్నారు. బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు తమ ఇంటి పార్టీగా భావిస్తారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నామని.. విద్యుత్‌, నీళ్ల సమస్యలకు చెక్ పెట్టామన్నారు. కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే కచ్చితంగా జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తామన్న మంత్రి.. కేసీఆర్‌ భరోసా కింద 15 కొత్త కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.


Updated : 25 Oct 2023 5:26 PM IST
Tags:    
Next Story
Share it
Top