Home > తెలంగాణ > నేను సీఎం అవ్వడానికి ఆయన పర్మిషన్ అవసరం లేదు : కేటీఆర్

నేను సీఎం అవ్వడానికి ఆయన పర్మిషన్ అవసరం లేదు : కేటీఆర్

నేను సీఎం అవ్వడానికి ఆయన పర్మిషన్ అవసరం లేదు : కేటీఆర్
X

తాను సీఎం అవ్వడానికి ప్రధాని పర్మిషన్ అవసరం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్పై మోదీ చేసిన వ్యాఖ్యల మీద మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మోదీ యాక్టింగ్‌కు ఆస్కార్‌ అవార్డు పక్కా వస్తుందని సెటైర్ వేశారు. మోదీ సినిమాలకు స్క్రిప్ట్ రాస్తే అది సూపర్ హిట్ అవుతుందన్నారు. నిజామాబాద్‌ సభలో మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. ప్రధాని స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం బాధాకరమన్నారు. ఎన్డీఏలో చేరాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నించారు.

బీజేపీ అంటే బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ అని కేటీఆర్ విమర్శించారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని.. ఈ సారి ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవరని అన్నారు. ‘‘ఎన్డీయే అనేది మునిగిపోయే నావ. మునిగే నావ ఎక్కాలని ఎందుకు అనుకుంటాం. ఆ కూటమి నుంచి ఎన్నో పార్టీలు బయటకు వచచాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నవి ఈడీ, సీబీఐ మాత్రమే. ఎన్డీయే వీడిన పార్టీలపైకి ఈడీ, సీబీఐని పంపుతున్నారు. బీజేపీలో చేరే నేతలను దర్యాప్తు సంస్థలు వదిలేస్తాయి’’ అని కేటీఆర్ అన్నారు.

అంతకుముందు నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తనను కలిసిట్లు చెప్పారు. ఆ సమయంలో ఎన్డీఏలో చేర్చుకోవాలని కోరారని.. దానికి తాను ఒప్పుకోలేదన్నారు. కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ చెప్పారని.. అయితే మీరేమైనా రాజులా అని కేసీఆర్ను ప్రశ్నించినట్లు మోదీ తెలిపారు. కేసీఆర్ అవినీతి చిట్టా ఆయన ముందు పెట్టానని స్పష్టం చేశారు. కేసీఆర్కు తన కళ్లలోకి చూసే ధైర్యం లేదని మోదీ ఎద్దేవా చేశారు.

Updated : 3 Oct 2023 8:18 PM IST
Tags:    
Next Story
Share it
Top