ఎంపీ అర్వింద్కు విద్వేషాలు రెచ్చగొట్టడమే తెలుసు : కేటీఆర్
X
నిజామాబాద్ ఎంపీ అర్వింద్పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎంపీకి మత విద్వేషాలు పెంచడం మాత్రమే తెలుసు అని ఆరోపించారు. ప్రతి దానికి హిందూ ముస్లిం అని మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడతారని విమర్శించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ప్రజలు అభివృద్ధి చేసేవారికి అండగా నిలవాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్, న్యాక్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఐటీ హబ్ అంటే కేవలం బిల్డింగ్ మాత్రమే కాదన్న కేటీఆర్.. స్థానిక యువత ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిబింబం అని చెప్పారు. రూ. 50 కోట్లతో ఐటీ హబ్ నిర్మించి.. 1400 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఉద్యోగాలు కావాలంటే.. మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా నైపుణ్యాన్ని పెంచుకోవాలని మంత్రి సూచించారు. భవిష్యత్ భద్రంగా, తల్లిదండ్రులు గర్వపడేలా ఉండాలంటే.. ఇలాంటి సదుపాయాలను అందిపుచ్చుకోవాలన్నారు.
రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని.. కానీ ప్రజలు కోరుకునేది అభివృద్ధి, సంక్షేమం మాత్రమే అని కేటీఆర్ తెలిపారు. ఐటీ హబ్ పక్కనే ప్రత్యేకంగా రూ. 11 కోట్లతో న్యాక్ బిల్డింగ్‌తో పాటు హాస్టల్ను ఏర్పాటు చేశామన్నారు. ‘‘రూ.7 కోట్లతో మున్సిపల్ కార్యాలయాన్ని అధునాతనంగా నిర్మించాం. తెలంగాణలోనే బెస్ట్ మున్సిపాలిటీ కార్యాలయం ఇక్కడే ఉందని చెప్పొచ్చు. ట్యాంక్ బండ్ మాదిరిగానే రఘునాథ చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దుబ్బ ప్రాంతంలో 15 కోట్ల 50 లక్షలతో మూడు వైకుంఠధామాలు అద్భుతంగా నిర్మించికున్నాం’’ అని కేటీఆర్ తెలిపారు.
minister ktr slams bjp mp arvind
minister ktr,mp arvind,nizamabad,it hub,telangana,minister prashanth reddy