Home > తెలంగాణ > KTR: కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కరెంటు కోతలు - మంత్రి కేటీఆర్

KTR: కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కరెంటు కోతలు - మంత్రి కేటీఆర్

KTR: కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కరెంటు కోతలు - మంత్రి కేటీఆర్
X

కాంగ్రెస్ పార్టీ అంటే కష్టాలు, కరెంటు కోతలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కన్నీళ్లే మిగులుతాయని, మతకల్లోలాలు చెలరేగుతాయని విమర్శించారు. ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలో అది చేసిందని అన్నారు. అప్పట్లో మంచినీరు, కరెంటు కష్టాలు ఉండేవని అప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు.

కాంగ్రెస్ కు అధికారం కట్టబెడితే కరెంటు కష్టాలు తప్పవని కేటీఆర్ అన్నారు. పొరుగురాష్ట్రం కర్నాటకలో కరెంటు కోసం రైతులు, పారిశ్రామికవేత్తలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. గత పదేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్న కేటీఆర్.. అన్ని రంగాల్లోనూ ఎల్బీనగర్ దూసుకుపోతోందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే పెద్ద అంబర్ పేట్ వరకు మెట్రోను విస్తరిస్తామని హామీ ఇచ్చారు.

14ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడిన చేసిన పోరాట యోధుడు కేసీఆర్ ఒకవైపు మిగతా వారు ఒకవైపు ఉన్నారని కేటీఆర్ అన్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో కరువు, కర్ఫ్యూలు లేవని గుర్తు చేశారు. ఎవరు అధికారంలో ఉంటే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుందో ప్రజలకు తెలుసని అన్నారు. ఎల్బీ నగర్ నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ నేత మధుయాష్కీకి ఎల్బీనగర్ లో ఏ కాలనీ ఏ మూలన ఉందో తెల్వదని విమర్శించారు. ఇక బీజేపీకి ఓటేస్తే అది మురికి కుప్పలో వేసినట్లేనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

Updated : 29 Oct 2023 11:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top