Home > తెలంగాణ > తెలంగాణలో స్కాంగ్రెస్కు చోటు లేదు

తెలంగాణలో స్కాంగ్రెస్కు చోటు లేదు

తెలంగాణలో స్కాంగ్రెస్కు చోటు లేదు
X

ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవడంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ వేడిని పెంచుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్పై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓట్ల కోసం కర్నాటక నుంచి వందల కోట్లను పంపిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో స్కాంగ్రెస్కు చోటులేదని ట్వీట్ చేశారు.

‘‘కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణలో ఓట్లు కొనుగోలు చేసేందుకు కర్నాటక నుంచి వందల కోట్లను పంపిస్తోంది. ఓటుకు నోటు కుంభకోణంలోలంచం ఇస్తూ కెమెరాకు చిక్కిన నేటి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి ఇది ఊహించిందే. తెలంగాణలో 'స్కాంగ్రెస్కు ప్రజలు నో చెప్పండి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతకుముందు కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్ నేతలు దొరికిపోయారంటూ బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌నూ మంత్రి రీట్వీట్ చేశారు.




Updated : 13 Oct 2023 5:35 PM IST
Tags:    
Next Story
Share it
Top