Home > తెలంగాణ > హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పులేదు :కేటీఆర్

హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పులేదు :కేటీఆర్

హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పులేదు :కేటీఆర్
X

కేసీఆర్‌ది మూడు పంటల నినాదమైతే కాంగ్రెస్‌ది మూడు గంటల నినాదం అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఉచిత కరెంటు మీద మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌ నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రేవంత్‌రెడ్డి మాటలు అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. రైతులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడున్నది రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ కాదని, చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని ఆరోపించారు. ఏనాడు మోదీని ప్రశ్నించలేదన్నారు . "ఎమ్మెల్యేలని కొనడంలో రేవంత్‌ సిద్ధహస్తుడు. గాంధీభవన్‌లో గాడ్సే రేవంత్‌రెడ్డి" అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

రైతులు రాజులుగా

తెలంగాణలో రైతుల పరిస్థితి మారిపోయిందని కేటీఆర్ చెప్పారు. " కేసీఆర్‌ తొమ్మిదేళ్ళ పాలనలో సంతోషంగా ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రైతుల్ని బీఆర్ఎస్ పార్టీ రాజులుగా చేసింది. గతంలో ఏ చెరువులనైనా నింపిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రాహుల్‌గాంధీ అంటున్నారని, అదెలా జరిగిందో చెప్పాలి " అని డిమాండ్ చేశారు.

హిమాన్షు మాటల్లో తప్పులేదు

హైదరాబాద్ శివార్లలోని కేశవనగర్‌ సర్కారు స్కూల్‌ను కార్పొరేట్ పాఠశాల ప్రారంభోత్సవంలో కుమారుడు హిమాన్స్ ఆడిన మాటలపై కేటీఆర్ స్పందించారు. హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదని.. సరిగ్గానే చెప్పాడని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలను కేసీఆర్ సర్కారు బాగు చేస్తోందని స్పష్టం చేశారు.

విమర్శల నేపథ్యంలో...

కేశవనగర్ స్కూల్ దుస్థితి చూసి.. తనకు కన్నీళ్లొచ్చాయని.. ఇలాంటి స్కూళ్లు ఇంకా చాలా ఉన్నాయంటూ హిమాన్షు చెప్పటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పని తీరును సీఎం కేసీఆర్ మనవడు తన మాటలతోనే స్పష్టంగా వివరించాడని పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. హిమాన్షు వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు.


Updated : 16 July 2023 1:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top