27 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఒక్క ఏడాదిలోనే జరిగింది-కేటీఆర్
X
రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు 31.4 శాతం పెరిగాయని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత 6 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. శాశససభ సమావేశాల్లో ఈ రోజు ఆయన మాట్లాడారు. కొంతమంది తామే హైదరాబాద్ లోని ఐటీ అభివృద్ధి చేశామని చెప్పుకుంటారు...మేము అలా కాదు అంటూ వివరించారు.
27 ఏళ్ళల్లో జరిగిన అభివృద్ధి తాము వచ్చాక ఒక్క ఏడాదిలోనే జరిగిందని అన్నారు కేటీఆర్. నగరంలో మొట్టమొదటి ఐటీ సంస్థ 1987లో వచ్చింది. అప్పటి నుంచి 2014 వరకు ఐటీ ఎగుమతులు 56 వేలకోట్లు. కానీ లాస్ట్ ఇయర్ ఒకే ఒక్క సంవత్సరంలో ఐటీ రంగంలో 57,707 కోట్ల ఎగుమతులు సాధించామని వివరించారు. దక్షత, సమర్ధత కలిగిన ప్రభుత్వాలు ఉంటే ఇలాంటి ఫలితాలే వస్తాయన్నారు. దేశం మొత్తంలో ఉన్న టెక్నాలజీ జాబ్స్ లో 44 శాతం తెలంగాణవే అని చెప్పారు.
అలాగే హైదరాబాద్ లో భూముల రేట్లు బాగా పెరిగియని అన్నారు కేటీఆర్. కోకాపేటలో భూముల ధర రికార్డులు బద్దలుకొట్టిందని తెలిపారు. స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్ షిప్ వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పుకున్నారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ విస్తరించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. నగరాలు ఎదగాలంటే పరిశ్రమలను ఆకర్షించాలని... తాము అదే పనిలో ఉన్నామని వివరించారు. కానీ ఇవేవీ చూడనట్టు, పట్టనట్టు విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేటాఆర్ మండిపడ్డారు.