మోడీ చెప్పిన రూ.15 లక్షలు వచ్చినోళ్లు బీజేపీకి ఓటేయండి - కేటీఆర్
X
ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతిపక్ష పార్టీలు ఇష్టానుసారం హామీలు ఇస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ బీజేపీపై ఫైర్ అయ్యారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామన్న మోడీ మాటలను కేటీఆర్ గుర్తు చేశారు. రూ.15లక్షలు వచ్చిన వారు బీజేపీకి ఓటు వేసుకోవచ్చని అన్నారు.
ఎన్నికల అనంతరం మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద 18ఏండ్లు నిండిన ప్రతి మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మోడీ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర వెయ్యికి పెరిగిందని, బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే రూ. 400లకే సిలిండర్ ఇస్తామని చెప్పారు. రేషన్ కార్డు ఉన్నోళ్లందరికీ రూ.5 లక్షల బీమా ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.