Home > తెలంగాణ > ఐటీ రంగంలో బెంగ‌ళూరును ప‌క్క‌కు నెట్టేసి ముందంజలో ఉన్నాం : కేటీఆర్

ఐటీ రంగంలో బెంగ‌ళూరును ప‌క్క‌కు నెట్టేసి ముందంజలో ఉన్నాం : కేటీఆర్

ఐటీ రంగంలో బెంగ‌ళూరును ప‌క్క‌కు నెట్టేసి ముందంజలో ఉన్నాం : కేటీఆర్
X

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణాల ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌తో ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు అభివృద్ధి సాధించాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది వేడుక‌ల్లో భాగంగా హైద‌రాబాద్ శిల్పాక‌ళావేదిక‌లో నిర్వ‌హించిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి వేడుక‌ల్లో కేటీఆర్ మాట్లాడుతూ..

"ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించాం. దేశంలోనే ఇవాళ బెంగ‌ళూరును ప‌క్క‌న పెట్టేసి.. ఐటీ రంగంలో హైద‌రాబాద్ ముందంజ‌లో ఉంది. ఐటీ ఎగుమతులు పెరుగుతున్నాయి. టీఎస్ఐపాస్ త‌ర‌హాలో టీఎస్ బీపాస్‌ను తీసుకొచ్చాం. రూ. 71 కోట్ల‌తో రాష్ట్రంలోని ప్ర‌తి మున్సిపాలిటీలో స్వ‌చ్ఛ బ‌డిని ప్ర‌వేశ‌పెడుతున్నాం. స్వ‌చ్ఛ బ‌డి ద్వారా తడి, పొడి, హానికర చెత్త వేరుచేసే విధానం, కంపోస్టు ఎరువు తయారీ చేసే విధానంపై అవగాహన రాష్ట్రమంతా యువతను అవగాహన పరుస్తాం. గ్రేట‌ర్ ప‌రిధిలో ప‌ని చేసే అధికారులు చిత్త‌శుద్ధితో, ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప్రారంభించుకున్న 150 వార్డు కార్యాలయాలు విజయవంతం అవుతాయి. వందదేశాలు తిరిగిన రజనీకాంత్ లాంటి వ్యక్తి హైదరాబాద్ అభివృద్ధిని కొనియాడారు. హైద‌రాబాద్‌లోని కొన్ని ప్రాంతాల‌కు వెళ్తే ఇది న్యూయార్క్‌లా అనిపించింద‌న్నారు. ఇది ఎస్ఆర్‌డీపీ అధికారులు, ఇంజినీర్ల విజయం. క‌రోనా కాలంలో అధికారులు, ఇంజినీర్లు హైద‌రాబాద్ న‌గ‌రంలో రాత్రింబ‌వ‌ళ్లు ప‌ని చేసి రోడ్లను, ఫ్లై ఓవ‌ర్ల‌ను శ‌ర‌వేగంగా నిర్మించారు. ఇక్క‌డితోనే సంతోష‌ప‌డిపోవ‌ద్దు.. మ‌నం సాధించాల్సింది ఇంకా ఉంది. తెలంగాణ ఆచ‌రిస్తుంది.. దేశం అనుస‌రిస్తుంది అనే నానుడి నిజం చేయ‌బోతున్నాం" అని కేటీఆర్ తెలిపారు.

Updated : 16 Jun 2023 9:02 PM IST
Tags:    
Next Story
Share it
Top