Home > తెలంగాణ > ఉప్పల్‌ ‘స్కైవాక్’ ప్రారంభానికి సిద్ధం..ప్రత్యేకతలివే

ఉప్పల్‌ ‘స్కైవాక్’ ప్రారంభానికి సిద్ధం..ప్రత్యేకతలివే

ఉప్పల్‌ ‘స్కైవాక్’ ప్రారంభానికి సిద్ధం..ప్రత్యేకతలివే
X

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు గురించి చెప్పక్కర్లేదు. వాహనదారులే కాదు పాదచారులు సైతం ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటారు. రద్దీ రోడ్లను దాటాలంటే కత్తిమీద సామే. ఇలా రోడ్లు క్రాస్ చేసే సమయంలో ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. నగరంలోని రద్దీ ఉన్న ప్రదేశాలలో ఉప్పల్ చౌరస్తా ఒకటి. ఇక్కడ పాదచారుల బాధలు అన్నీఇన్నీ కావు. ఇకపై వారి కష్టాలు తొలగనున్నాయి.

ఉప్పల్‌ జంక్షన్‌ వద్ద పాదచారుల ట్రాఫిక్ కష్టాలకు చెక్‌ పెడుతూ స్కై వాక్‌ అందుబాటులోకి రానుంది. 20 అడుగుల ఎత్తులో నిర్మించే స్కై వాక్‌‌ను మంత్రి కేటీఆర్ జూన్ 26న ప్రారంభించనున్నారు. రూ.25 కోట్లతో నిర్మితమవుతున్న స్కై వాక్‌ బ్రిడ్జి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

దేశంలోనే అత్యంత పొడవైన వంతెన ఇది. రాబోయే 100 సంవత్సరాలకు పైగా పాదచారుల సౌకర్యార్థం దీనిని రూపొందించారు. నిర్మాణ పనుల్లో సుమారు వెయ్యి టన్నులకు పైగా స్ట్రక్చరల్ స్టీల్ వాడారు. ఇక్కడ అమర్చిన ఎల్‌ఈడీ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి.ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రజలకు 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కలేటర్లు అందుబాటులో ఉంటాయి. భూమి నుంచి 6 మీటర్ల ఎత్తులో స్కైవాక్‌ను నిర్మించారు. దీని పొడవు 660 మీటర్లు. అందంగా కనిపించేందుకు 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు. స్కైవాక్ బ్రిడ్జిపై వాహనాల డిస్టబెన్స్ ఉండదు. దీంతో ఎలాంటి భయం లేకుండా పాదచారులు వెళ్లొచ్చు. స్కైవాక్ పై నుంచి ఏరియల్ వ్యూ చూసి కొత్త అనుభూతి పొందవచ్చు. బ్రిడ్జిపై సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది.

Updated : 24 Jun 2023 2:08 PM GMT
Tags:    
Next Story
Share it
Top