Home > తెలంగాణ > నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్
X

మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. గీసుకొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో యంగ్ వన్ కంపెనీ రూ.840 కోట్లతో నిర్మించనున్న వస్త్ర పరిశ్రమకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ కార్యక్రమం పూర్తైన అనంతరం ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఖిలా వరంగల్ చేరుకుంటారు. నర్సంపేట రోడ్డులో వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును కేటీఆర్‌ ప్రారంభిస్తారు. అనంతరం అజంజాహిమిల్స్‌ గ్రౌండ్‌లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు.

దేశాయిపేట వద్ద రూ.12.60 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను కేటీఆర్ ప్రారంభించనున్నారు. వరంగల్‌లో రూ.135 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 16 స్మార్టు రోడ్లను కూడా వరంగల్‌ చౌరస్తా వద్ద ప్రారంభిస్తారు. అనంతరం రూ.75 కోట్లతో నిర్మించనున్న వరంగల్‌ మోడ్రన్‌ బస్‌స్టేషన్‌, రూ.313 కోట్లతో చేపట్టిన ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులకూ ఆయన శంకుస్థాపన చేస్తారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ(కుడా) జీ ఫ్లస్‌ ఫైవ్‌ అంతస్తుల్లో నిర్మించే బస్‌స్టేషన్‌ కు శంకుస్థాపన చేసిన తర్వాత అజంజాహి మిల్స్‌ గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు దాదాపు 50 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

Updated : 17 Jun 2023 7:14 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top