Home > తెలంగాణ > ఆకాశంలో సగం కాదు.. ‘ఆమే’ ఆకాశం.. మంత్రి కేటీఆర్

ఆకాశంలో సగం కాదు.. ‘ఆమే’ ఆకాశం.. మంత్రి కేటీఆర్

ఆకాశంలో సగం కాదు.. ‘ఆమే’ ఆకాశం.. మంత్రి కేటీఆర్
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళా లోకానికి దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ఆకాశంలో సగం కాదు.. ‘ఆమే’ ఆకాశం. సంక్షేమంలో సగం కాదు.. ‘ఆమే’ అగ్రభాగం. మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శం. పుట్టిన ఆడబిడ్డ నుంచి అవ్వల వరకు అందరినీ కేసీఆర్ సర్కార్ కంటికి రెప్పలా కాపాడుతోంది. గర్భిణులకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్లు ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి అడుగు. ఆడబిడ్డ పుట్టిందంటే ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే. కేసీఆర్ కిట్‌తో పాటు అందే రూ.13 వేలు ప్రతి పుట్టిల్లు ఎప్పటికీ మరువలేని మేలు..





కల్యాణలక్ష్మి కేవలం పథకంకాదు... ఒక విప్లవం. ఓవైపు భ్రూణహత్యలకు బ్రేక్.. మరోవైపు బాల్యవివాహాలకు ఫుల్ స్టాప్. ఇంకోవైపు తల్లిదండ్రుల భారాన్ని దించే భరోసా

పదిలక్షలకుపైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన మేనమామ సీఎం కేసిఆర్ గారు. గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను మిషన్ భగీరథతో శాశ్వతంగా తీర్చిన విజన్ ఉన్న ముఖ్యమంత్రి.. సీఎం కేసిఆర్ గారు. మన అంగన్ వాడీలను, ఆశా కార్యకర్తలను వెట్టి చాకిరి నుంచి విముక్తి చేసిన సందర్భం.. దేశంలోనే అత్యధిక పారితోషికాలతో.. గౌరవప్రదంగా జీవించే గొప్ప అవకాశం..ఆడబిడ్డల సంక్షేమంలో మనకు ఎదురులేదు. మహిళా సాధికారతలో తెలంగాణకు తిరుగులేదు.



అమ్మఒడి వాహనమైనా.. ఆరోగ్యలక్ష్మి పథకమైనా..నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం..పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ హర్షం..భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా.. ఒంటరి మహిళలకు తండ్రిలా...ఆడబిడ్డలకు మేనమామలా..అవ్వలకు పెద్దకొడుకులా...కొండంత అండగా నిలుస్తున్న

ముఖ్యమంత్రి కేసిఆర్ గారిని మనసారా ఆశీర్వదిస్తున్న యావత్ మహిళా లోకానికి... దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు " అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated : 13 Jun 2023 12:10 PM IST
Tags:    
Next Story
Share it
Top